Anushka Shetty | స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది స్వీటీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఈ బెంగళూరు సుందరి తాజాగా ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నవిషయం తెలిసిందే.
క్రిష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో విడుదల కానుంది. కాగా వేదం సినిమా తర్వాత క్రిష్, అనుష్క కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఘాటిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే వేదం సినిమాలో అనుష్కా శెట్టి పోషించిన సరోజ పాత్రకు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలంగా అనుష్క, తాను ఓ ఎక్జయిటింగ్ ప్రాజెక్టుపై పనిచేయాలనుకుంటున్నామని చెప్పాడు క్రిష్. అంతేకాదు అనుష్క తనకు సరోజ 2 సినిమా చేయాలని కూడా సూచించిందని చెప్పాడు క్రిష్.
నిజంగా ఈ ఐకానిక్ రోల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులకు థ్రిల్ అందించడం పక్కా అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రాబోయే రోజుల్లో అనుష్క సలహాను క్రిష్ సీరియస్‌గా తీసుకుని సరోజ 2ను సెట్స్‌పైకి తీసుకెళ్తాడా..? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ క్రేజీ కాంబో రిపీట్ అయితే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం గ్యారంటీ అని అప్పుడు చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఘాటి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీలో విక్రం ప్రభు, చైతన్య రావ్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Vada Chennai 2 | వడ చెన్నై 2 వచ్చేస్తుంది.. క్రేజీ సీక్వెల్‌పై వెట్రిమారన్ ఏమన్నాడంటే..?
Game Changer Editor | డైరెక్టర్‌గా గేమ్ ఛేంజర్ ఎడిటర్.. స్టార్ హీరో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ..!