Game Changer Editor | సినీ ఇండస్ట్రీలో యాక్టర్లు, టెక్నీషియన్లు డైరెక్టర్లుగా మారడం కొత్తేమీ కాదు. ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీతోపాటు పలు ఇండస్ట్రీల్లో చాలా మంది టెక్నీషియన్లు డైరెక్టర్లుగా మారి సక్సెస్ అందుకున్నారు. ఈ జాబితాలో మరో వ్యక్తి కూడా జాయిన్ కాబోతున్నాడు. ఇంతకీ అతడెవరనే కదా మీ డౌటు. శంకర్ అన్‌ప్రొఫెషనల్ అని.. గేమ్ ఛేంజర్ సినిమాకు పనిచేయడం ఒక భయంకరమైన అనుభవం అంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేసి నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచాడు గేమ్ ఛేంజర్ ఎడిటర్ షమీర్ మహ్మద్ .
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్‌కు ఎడిటర్‌గా పనిచేసిన షమీర్ ఇక మెగా ఫోన్ పట్టనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. షమీర్ మహ్మద్ త్వరలోనే మలయాళ సినిమాతో డైరెక్టోరియల్ డెబ్యూ ఇవ్వనున్నాడని ఇండస్ట్రీ సర్కిల్లో ఓ వార్త తెరపైకి వచ్చింది. పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించనున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఉండబోతుందట.
ఇదివరకెన్నడూ కనిపించని నయా అవతార్‌లో పృథ్విరాజ్ సుకుమారన్ మెరువబోతున్నట్టు మాలీవుడ్ సర్కిల్ టాక్. వైశాఖ్ డైరెక్షన్లో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తోన్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ఖలీఫా ఎడిటర్‌గా ఫైనల్ అయ్యాడు షమీర్ మహ్మద్. అయితే తాను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వాలని ఫిక్సయినప్పటి నుంచి తన బాధ్యతలను వేరే టెక్నీషియన్‌కు అప్పగించాడట షమీర్ మహ్మద్. మొత్తానికి షమీర్ మహ్మద్ మరి పృథ్విరాజ్ సుకుమారన్‌తో ఎలాంటి ఎంట్రీ ఇస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Anjali Raghav | అనుచితంగా హీరోయిన్ నడుము తాకిన స్టార్ నటుడు.. వివాదంపై స్పందించిన నటి
Vishal – Dhansika | ఇద్దరు ఒక్క సినిమా కూడా చేయలేదు.. విశాల్, ధన్సిక మధ్య ప్రేమ ఎలా పుట్టింది?