Anjali Raghav | భోజ్‌పురి నటుడు పవన్ సింగ్, నటి అంజలి రాఘవ్ నడుమును అనుమతి లేకుండా తాకిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసిన ‘సైయా సేవ కరే’ అనే ఆల్బమ్ ప్రమోషన్లో భాగంగా లక్నోలో జరిగిన ఒక ఈవెంట్లో పవన్ సింగ్ అంజలి నడుమును అనుచితంగా తాకాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పవన్ సింగ్ తీరును తప్పుబట్టారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయిన నటి ఇంకా స్పందించలేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న అంజలి రాఘవ్ తాజాగా ఒక వీడియో ద్వారా స్పందిస్తూ.. పవన్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
అంజలి మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా నేను చాలా బాధపడుతున్నాను. లక్నోలో జరిగిన ఘటనపై ఎందుకు స్పందించలేదని, ఎందుకు చర్యలు తీసుకోలేదని నాకు నిత్యం ఫోన్లతో పాటు సందేశాలు వస్తున్నాయి. కొందరు ఈ ఘటనను తప్పుగా అర్థం చేసుకుని.. నేను నవ్వుతున్నాను. సరాదాగా ఉన్నాను అంటున్నారు. ఎవరైన అనుమతి లేకుండా అలా తాకితే ఆనందంగా ఉంటుందా? సరాదాగా ఉంటుందా? అని అంజలి తన ఆవేదన వ్యక్తం చేసింది.
నేను ఈవెంట్లో మాట్లాడుతుండగా.. పవన్ సింగ్ తన నడుముపై ఏదో అంటుకుని ఉందని చెప్పారని.. దానికి తీసే క్రమంలో తనను తాకారని అనుకున్నానని అంజలి తెలిపారు. నేను ఆరోజు కొత్త చీర కట్టుకున్నందున బ్లౌజ్ ట్యాగ్ ఏమైనా బయటికి వచ్చిందేమోనని తాను నవ్వాను. ఆ తర్వాత తన టీమ్ మెంబర్‌ను అడిగితే అక్కడ ఏమీ లేదని చెప్పడంతో నాకు చాలా కోపంతో పాటు బాధ వచ్చిందని అంజలి అన్నారు. అయితే ఈ విషయంపై ప్రైవేట్‌గా మాట్లాడదామని అనుకునేలోపే పవన్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారని అంజలి వివరించారు.
ఈ ఘటన గురించి బయట మాట్లాడితే.. పవన్ సింగ్‌కి భారీ నెట్వర్క్ ఉందంటూ తనను బెదిరించారని అంజలి తెలిపారు. అందుకే ఈ ఘటన గురించి తాను మాట్లాడకుండా మౌనంగా ఉన్నానని కొన్నిరోజులకు ఈ విషయం సద్దుమణుగుతుందని భావించినట్లు చెప్పారు. కానీ ఈ ఘటన మరింత పెద్దదిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తాను తీవ్రంగా కలత చెందానని అంజలి తెలిపారు. ఏ అమ్మాయిని అయిన అనుమతి లేకుండా తాకడం చాలా తప్పు అని అంజలి అన్నారు. ఒకవేళ ఇదే విషయం హర్యానాలో జరిగి ఉంటే అక్కడి ప్రజలు వాటంతట వారే సమాధానం ఇచ్చేవారు. కానీ నేను లక్నోలో ఉన్నాను ఇది నా ప్రాంతం కాదు అని అంజలి తెలిపారు. ఈ సంఘటన తర్వాత తాను భోజ్‌పురి చిత్రాల్లో ఇకపై నటించబోనని అంజలి సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read