Anjali Raghav | భోజ్‌పురి స్టార్ నటుడు పవన్ సింగ్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన సహనటి అంజలి రాఘవ్‌తో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ సింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే..
ఒక ఈవెంట్లో భాగంగా.. పవన్ సింగ్, అంజలి రాఘవ్ కలిసి వేదికపై వచ్చారు. అనంతరం అంజలి ప్రేక్షకులతో మాట్లాడుతుండగా.. పవన్ సింగ్ అనుమతి లేకుండా ఆమె నడుముపై చేయి వేసి తడిమాడు. అంతేగాకుండా తన నడుముపై ఎదో ఉందని పదే పదే అనడంతో అంజలి ఒక క్షణం అసౌకర్యానికి గురైంది. అయితే వెంటనే చిరునవ్వుతో అంజలి ఆ పరిస్థితిని కవర్ చేయడానికి ప్రయత్నించింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వగా.. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది పవన్ సింగ్ చర్యను క్రీపీ (భయానకమైనది) అని అభివర్ణిస్తుండగా.. మరికొంతమంది స్పందిస్తూ పవన్ సింగ్ ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉందని, బహిరంగ ప్రదేశంలో ఒక మహిళను అనుమతి(Consent) లేకుండా తాకి ఇలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై పవన్ సింగ్ లేదా అంజలి రాఘవ్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వివాదం ప్రస్తుతం భోజ్‌పురి పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Indian men don’t know the concept of Consent.
And it gets even worse in UP-Bihar🤢This is so-called Bhojpuri star Pawan Singh.
Imagine what his fans will be learning from him.pic.twitter.com/rPofG2VbOe— Tarun Gautam (@TARUNspeakss) August 28, 2025