Vada Chennai 2 | గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వచ్చిన చిత్రం వడ చెన్నై. 2018లో ధనుష్-వెట్రిమారన్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఈ ఇద్దరూ మరోసారి అలాంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేసేందుకు సీక్వెల్ (Vada Chennai 2)తో వస్తున్నారంటూ ఇప్పటికే చాలా కథనాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా మారిన ఈ క్రేజీ సీక్వెల్‌పై ఫైనల్‌గా ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. శనివారం చెన్నైలో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో వెట్రిమారన్ వడా చెన్నై 2 అప్డేట్ అందించాడు.
శింబుతో చేయబోతున్న సినిమా త్వరలోనే మొదలవుతుందని చెప్పాడు. అంతేకాదు శింబు సినిమా పూర్తవగానే వడ చెన్నై 2ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు చెప్పాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తమ ఫేవరేట్ సినిమా సీక్వెల్‌పై ఏకంగా వెట్రిమారన్ నుంచే స్పష్టత రావడంతో అభిమానులు, మూవీ లవర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వడ చెన్నై ఫస్ట్ పార్టులో అండ్రియా, అమీర్, కిశోర్, సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్.
కాగా మరి సీక్వెల్లో ఎవరెవరు సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతున్నారనేది ఆసక్తిగా నెలకొంది. ధనుష్ ఇటీవలే కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ఘనవిజయం సాధించగా.. తమిళంలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక పలు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు ధనుష్.
Game Changer Editor | డైరెక్టర్‌గా గేమ్ ఛేంజర్ ఎడిటర్.. స్టార్ హీరో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ..!
Vishal – Dhansika | ఇద్దరు ఒక్క సినిమా కూడా చేయలేదు.. విశాల్, ధన్సిక మధ్య ప్రేమ ఎలా పుట్టింది?