Akshay Kumar | బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కేరళలోని గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్నాడు. అక్షయ్ ప్రస్తుతం కేరళలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైవాన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్లో విరామం తీసుకున్న ఆయన గురువాయూర్ ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.
హెలికాప్టర్లో ఆలయానికి చేరుకున్న అక్షయ్ కుమార్, కేరళ సంప్రదాయ వస్త్రమైన ముండు ధరించి దర్శనానికి వెళ్లారు. దీంతో అక్షయ్‌ను చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక ఆలయంలో అక్షయ్ ప్రత్యేక పూజలు చేసి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అక్షయ్ ఆలయానికి వచ్చిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘హైవాన్’ చిత్రంలో అక్షయ్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది ప్రియదర్శన్, అక్షయ్, సైఫ్ ముగ్గురి కలయికలో వస్తున్న సినిమా.
#AkshayKumar𓃵 sir visited Guruvayur Temple in Kochi today. pic.twitter.com/AOINPoyNvk
— Akshay Kumar 24×7 (@Akkistaan) September 1, 2025