రామగిరి, ఫిబ్రవరి 27 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీల్డ్ విజిట్ లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించడం జరిగింది. యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ నందు జరుగుతున్నటువంటి శాస్త్ర పరిశోధన ప్రయోగశాలలను డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో సందర్శించి అవగాహనను ఏర్పరచుకున్నారు. ప్రొఫెసర్ మనోజ్ కుమార్ విద్యార్థులతో మాట్లాడుతూ భౌతిక శాస్త్రాన్ని పరిశీలన దుక్కోణంలో చూసినప్పుడు పరిపక్వతను సాధించవచ్చు అన్నారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి అతి పెద్ద గ్రంథాలయాన్ని సందర్శించడం ద్వారా విద్యార్థులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్లో తాము కూడా ఈ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజిక్స్ హెచ్ఓడీ ఎం.శ్రీనివాస్ రెడ్డి, లెక్చరర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ వి.వెంకటేశం, మన్నెం వెంకటయ్య, శశికళ పాల్గొన్నారు.

నల్లగొండ ఎన్జీ కళాశాల విద్యార్ధులు హెచ్సీయూ సందర్శన