గద్వాల : గద్వాల ( Gadwala ) మండలంలోని జిల్లెడ బండ గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ( Sexual harassment ) జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలికను వేధింపులకు గురిచేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తక్షణమే స్పందించారు. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.