ఖమ్మం సిటీ, మార్చి 1: ఖమ్మం భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన పేదలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భరోసా ఇచ్చారు. కేటీఆర్ ఆదేశానుసారం ఆదివారం బాధితులను ఖమ్మం నుంచి హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లి లీగల్ సెల్ బృందంతో మాట్లాడించారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. భూదాన్ భూముల్లో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసి, పేదలను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేటీఆర్ మార్గదర్శకంలో సుప్రీంకోర్టుకైనా వెళ్లి పోరాడుతామని స్పష్టంచేశారు. రేవంత్ సర్కార్ కూ ల్చివేసిన చోటే పక్కా ఇండ్లు నిర్మించేంత వరకు వదిలిపెట్టేదేలేదని తేల్చిచెప్పారు.