ఢిల్లీ : ప్రేగ్ ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్స్‌లో తొలి విజయం కోసం వేచిచూస్తున్న వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్‌కు నాలుగో రౌండ్లోనే నిరాశే ఎదురైంది. నాలుగో రౌండ్లో అతడు.. డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.
తొమ్మిది రౌండ్లుగా జరుగబోయే ఈ టోర్నీలో జోర్డెన్ (హాలండ్) నాలుగు గేమ్‌ల్లో మూడు గెలిచి 3 పాయింట్లతో అగ్రస్థానాన కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ చిదంబరం నాలుగో రౌండ్లో విన్సెంట్ కీమర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు.