Water leak | తొగుట, సెప్టెంబర్ 07 : తొగుట మండలంలోని వెంకట్రావుపేట వనం చెరువు తూము దగ్గర నుండి నీళ్లు బయటకు లీక్ అవుతున్నాయి. ఈ విషయమై స్పందించిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తహసీల్దార్ శ్రీకాంత్ గారితో, డీఈఈ శ్రీనివాస్, ఏఈఈ అస్మాతో మాట్లాడటం జరిగింది. ఈ మేరకు వాళ్లు లస్కర్లను పంపించారు. అయితే వాళ్లు బుంగ పూడ్చివేసేందుకు గడ్డి కట్టలు వేసినా నీళ్లు ఆగక పోవడంతో జేసీబీ స్వామిని పిలిచి రైతులు, లస్కర్లతో కలిసి మట్టి వేయించి బుంగ పూడ్చి వేశారు.
బుంగ పూడ్చడంలో సహకరించిన లస్కర్లకు, రైతులకు ఈ సందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లస్కర్లు సయ్యద్ పాషా, మల్లేశం, రామచంద్రం, శంకరయ్య, కే మల్లేశం, సత్యనారాయణ, నాయకులు బండారు స్వామి గౌడ్, పాత్కుల బాలేష్, జహంగీర్, పాత్కుల అశోక్, వెంకటేష్, ఎల్లం, మన్నె లక్ష్మి నర్సు, ఈదుగాళ్ల స్వామి, మల్లేశం తదితరులు ఉన్నారు.
Illegal Transport | అక్రమంగా మొరం తవ్వుతున్న వాహనాలను పట్టుకున్న గ్రామస్థులు
KTR | ములుగులో మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్న కేటీఆర్