లక్ష్మణ చంద: నిర్మల్ జిల్లా లక్ష్మణచంద (Lakshmana Chanda) మండలం పారుపెల్లి గ్రామంలో అక్రమంగా మొరం తవ్వకాలు( Illegal Sand ) జరుపుతున్న తరలిస్తున్న వాహనాలను గ్రామస్థులు పట్టుకున్నారు. గ్రామ శివారులోని భీమన్న గుట్ట( Beemanna Gutta) ,గోసం గుట్ట ( Gosam gutta 0 లను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పారుపెల్లి గ్రామాన్ని ఆనుకొని ఉన్న భీమన్న గుట్ట , గోసం గుట్టలను రెవెన్యూ అధికారుల సహాయంతో ఇతర గ్రామస్థులు అక్రమంగా పట్టాలు చేసుకున్నారని ఆరోపించారు. ఈ గుట్టలలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. అక్రమ దందా చేస్తున్న వారికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు . గతంలో అనేకసార్లు తహసీల్దార్‌కు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.
శనివారం భీముని గుట్ట సమీపంలో అక్రమ మొరంతవ్వకలు జరుగుతున్నాయని తెలుసుకున్న గ్రామస్థులు సంఘటన స్థలానికి వెళ్లి అక్రమ మొరం తవ్వుతున్న జేసీబీతో పాటు రెండు ట్రాక్టర్లను పట్టుకొని గ్రామంలోనికి తీసుకువచ్చారు. అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు .
జిల్లా స్థాయి అధికారులు స్పందించి విచారణ జరిపి అక్రమంగా మొరంతవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్థులు పట్టుకున్న వాహనాలను వెంటనే సీజ్ చేయాలన్నారు. రెవెన్యూ అధికారులు అక్రమంగా చేసిన పట్టాలను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్ యాదవ్ నాయకులు గోవర్ధన్ సాగర్ రెడ్డి, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదు : తహసీల్దార్ సరిత ( Tahasildar Sarita )
లక్ష్మణ చందా మండలం పారుపల్లి శివారులో మొరం తవ్వకాల కోసం ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని వెల్లడించారు. పట్టుకున్న వాహనాలపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.