Urea | కొమురవెల్లి, జూలై 7 : రైతులు అవసరం మేర మాత్రమే యూరియాను వాడాలని కొమురవెల్లి మండల వ్యవసాయాధికారి వెంకట్రావమ్మ అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ యూరియా తేలికగా నీటిలో కరుగుతుందని, గాలిలో కలిసిపోవడం వలన గాలి, నీరు కాలుష్యం అవుతుందన్నారు.
ఎక్కువ యూరియా వాడటం వలన ధాన్యపు పైర్లు విపరీతంగా పెరిగి పడిపోవడమే కాకుండా పూత ఆలస్యంగా వచ్చి పంటకాలం పెరుగడంతోపాటు తాలు గింజలు వస్తాయన్నారు. అధికంగా యూరియా వాడటం వలన పంట చేను దగ్గరికి చీడపీడలు సులభంగా చేరుతాయన్నారు. అదే విధంగా పెట్టుబడులు పెరిగి దిగుబడి తగ్గుతుందన్నారు. కాబట్టి రైతులు యూరియా తక్కువగా వాడి ఎక్కువ లాభాలు పొందాలన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు