రామాయంపేట, జూలై 07: రామాయంపేటలోని మహంకాళి అమ్మవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు (Mahankali Brahmotsavalu) ముస్తాబవుతున్నది. ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 18 నుంచి 21 వరకు మహంకాళి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సరాఫ్ పాండురంగా చారి తెలిపారు. ఈ నెల18న (శుక్రవారం) అఖండ దీరాధన, అభిషేకం, 19న ప్రాతఃకాల పూజ, శాంతి కళ్యాణం, 20న దేవస్థానంలో సదర్ బోనం ఊరేగింపు, 21న అమ్మవారి వార్షిక మహానివేదన, ఆరగింపు చేయుట, మంగళ హారతి, మంత్ర పుష్పం జరుగునున్నాయని వెల్లడించారు.
పట్టణంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని వేడుకలను విజయవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు హాజరవుతారని ఆలయ కమిటీ చైర్మన్, కార్యనిర్వాహన అధికారి రవికుమార్, జూనియర్ అసిస్టెంట్ మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది యాదగిరి, సత్యం, లక్ష్మి, నరేశ్‌లు తెలిపారు.