Milk | పరగడుపున పాలను తాగాలా.. వద్దా.. తాగితే ఏమవుతుంది.. వైద్యులు ఏమంటున్నారు..?
గోరు వెచ్చని పాలను తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. వీటిని తాగడం వల్ల హాయిగా ఉండడంతో పాటు నిద్ర బాగా వస్తుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నమ్ముతారు. అలాగే మరికొందరు పేగుల ఆరోగ్యం కోసం తమ రోజును గోరు వెచ్చని పాలతో ప్రారంభిస్తూ ఉంటారు.
Milk | గోరు వెచ్చని పాలను తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. వీటిని తాగడం వల్ల హాయిగా ఉండడంతో పాటు నిద్ర బాగా వస్తుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నమ్ముతారు. అలాగే మరికొందరు పేగుల ఆరోగ్యం కోసం తమ రోజును గోరు వెచ్చని పాలతో ప్రారంభిస్తూ ఉంటారు. పాలల్లో క్యాల్షియం, ప్రోటీన్ తో పాటు శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. కనుక పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఖాళీ కడుపుతో పాలను తాగడం మంచిదేనా.. అన్న సందేహం చాలా మందికి కలుగుతుంది. అలాగే పాలను త్రాగడంపై ఉన్న మరికొన్ని సందేహాలు, అపోహల గురించి వైద్యులు ఏమంటున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఉబ్బరం, ఆమ్లత్వం..
ఖాళీ కడుపున పాలు తాగడం కొందరికి కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. అయితే మరికొందరికి ఖాళీ కడుపున పాలు తాగడం వల్ల ఉబ్బరం, ఆమ్లత్వం కలిగిస్తుంది. కనుక పాలను ఖాళీ కడుపున తీసుకోవాలా వద్దా అన్నది సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పాలు పోషకమైనవే అయినప్పటికీ ప్రతి ఒక్కరు వాటిని ఖాళీ కడుపుతో తాగలేరు. కొందరిలో ఇది ఉబ్బరం, తిమ్మిరి, గ్యాస్ వంటి సమస్యలను కలిగించవచ్చు. కనుక సున్నితమైన జీర్ణక్రియ ఉన్నవారు పాలల్లో ఓట్స్ లేదా ఇతర గింజలను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కడుపులో అసౌకర్యం తగ్గుతుంది. ఇక పాలను తాగడం వల్ల శరీర జీవక్రియ తక్షణమే పెరుగుతుందని భావిస్తారు. కానీ ఇది అపోహ మాత్రమే అని వైద్యులు చెబుతున్నారు.
కండరాల పెరుగుదలకు..
పాలల్లో ప్రోటీన్ ఉంటుంది. కండరాల పెరుగుదలకు, మరమ్మత్తుకు ఇది సహాయపడుతుంది. కానీ జీవక్రియను పాలు పెంచవని వైద్యులు తెలియజేస్తున్నారు. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం, హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట కాకుండా వ్యాయామం చేసే సమయానికి దగ్గరగా పాలు మంచిది. అదే విధంగా గోరువెచ్చని పాలు కడుపులో ఆమ్లత్వాన్ని నివారిస్తాయని భావిస్తారు. గోరు వెచ్చని పాలు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినప్పటికీ పూర్తి కొవ్వు పాలు ఆమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. సులభంగా ఆమ్లత్వం వచ్చే ధోరణి ఉన్నవారు తక్కువ కొవ్వు ఉన్న పాలు తాగడం మంచిది లేదా ఖాళీ కడుపుతో పాలు తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ఎవరి సొంత నిర్ణయం వారిది..
అలాగే కొందరు పూర్తి అల్పాహారంగా పాలను మాత్రమే తీసుకుంటూ ఉంటారు. పాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని మాత్రమే అల్పాహారంగా తీసుకోకూడదు. కేవలం పాలను తాగి మధ్యాహ్నం భోజన సమయం వరకు ఉండడం అంత మంచిది కాదు కనుక పాలల్లో చియా గింజలు, ఓట్స్, అరటిపండు వంటి వాటిని కలిపి తీసుకోవడం మంచిది. ఇక కొందరు పాలను తాగడం వల్ల నిద్ర బాగా వస్తుందని ఉదయం పూట ఖాళీ కడుపుతో పాలు తాగుతూ ఉంటారు. పాలల్లో నిద్రకు సహాయపడే ట్రిప్టోఫాన్ ఉంటుంది. కానీ అది స్థిరంగా ఉండదు. నిద్ర బాగా పట్టాలనుకునే వారు ఉదయం పూట కంటే రాత్రి పడుకోవడానికి 30 నుండి 60 నిమిషాల ముందు పాలు తాగడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే కొందరు పాలను మాత్రమే తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయని భావిస్తారు. కానీ ఇది అపోహ మాత్రమే అని విటమిన్ డి తో పాటు ఇతర పోషకాలు తీసుకుంటేనే తగినంత క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. పాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని ఖాళీ కడుపున తీసుకోవాలా వద్దా అనే విషయం సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- milk
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

