Samsung Galaxy S26 | సామ్సంగ్ నుంచి గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్లు విడుదల.. అదిరిపోయే ఫీచర్లు
Samsung Galaxy S26 : సౌత్ కొరియాకు చెందిన బ్రాండ్ సామ్సంగ్ తాజాగా మరికొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్లను విడుదల చేసింది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్26 ప్లస్, గెలాక్సీ ఎస్26 అల్ట్రా పేర్లతో మూడు హైఎండ్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
Samsung Galaxy S26 : సౌత్ కొరియాకు చెందిన బ్రాండ్ సామ్సంగ్ తాజాగా మరికొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్లను విడుదల చేసింది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్26 ప్లస్, గెలాక్సీ ఎస్26 అల్ట్రా పేర్లతో మూడు హైఎండ్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి లేటెస్ట్ మోస్ట్ పవర్డ్ ఏఐ ఫోన్లు. ప్రైవసీ డిస్ప్లే మరో ప్రత్యేకత. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ 5వ జనరేషన్ చిప్స్తో ఈ ఫోన్లు రూపొందాయి.
వీటిలోని కొన్ని కీలక ఫీచర్లివి. గెలాక్సీ ఎస్26, ఎస్26 ప్లస్ ఫోన్లలో దాదాపు ఒకే తరహా ఫీచర్లుంటాయి. డిస్ప్లే సైజ్, బ్యాటరీ కెపాసిటీయే ముఖ్యమైన తేడా. 6.3 అంగుళాల ఫుల్ హెచ్డి+డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే (ఎస్26), 6.7 అంగుళాల క్యూహెచ్డీ+ప్యానెల్ (ఎస్26 ప్లస్), స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ 5వ జనరేషన్ ప్రాసెసర్, 50 ఎంపీ వైడ్ లెన్స్, 12 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 10 ఎంపీ టెలీఫొటో లెన్స్, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ (ఎస్26), 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ (ఎస్26 ప్లస్), 25 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ (ఎస్26), 45 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ (ఎస్26 ప్లస్), ఐపీ 68 రేటింగ్ వంటి ఫీచర్లుండగా కోబాల్ట్ వయొలెట్, వైట్, బ్లాక్, స్కై బ్లూ కలర్స్లో లభిస్తుంది.
ఇక ఎస్26 అల్ట్రాలో 6.9 అంగుళాల క్యూహెచ్డీ+డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, ప్రైవసీ డిస్ప్లే, 200 ఎంపీ వైడ్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 50 ఎంపీ టెలీ ఫొటో లెన్స్, 10 ఎంపీ టెలీఫొటో లెన్స్, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 60 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ 68 రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి. వీటి ధరల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

