రామాయంపేట, జూలై 07: లేబర్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ వైద్య పరీక్షలు చేస్తామని రామాయంపేట సీహెచ్‌సీ వైద్య సిబ్బంది దేవేందర్, ప్రమోద్ తెలిపారు. రామాయంపేటలోని సీహెచ్‌సీ దవాఖానలో శిబిరం ఏర్పాటు చేసి లేబర్ కార్డు ఉన్నవారికి వారి కార్డును చూసి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. ప్రజలకు ముఖ్యంగా లేబర్‌కు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెప్పారు.
కార్మికుల కోసం ప్రభుత్వం ముందస్తుగా లేబర్‌కు ఈ రక్త నమూనాల సేకరణను చేపట్టిందని తెలిపారు. రామాయంపేట మండల వ్యాప్తంగా మొత్తం 1200 కార్డులు ఉన్నాయని, ఇప్పటి వరకు 370 మంది కార్మికులను గుర్తించి రక్తనమూనాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. ఈనెల 20 వరకు సీహెసీలోనే ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. లేబర్ కార్డులు ఉన్నవారు నేరుగా రావాలని తెలిపారు.