Balka Suman | నేడు బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ విచారణ
Balka Suman | మంచిర్యాల జిల్లా కోర్టులో బాల్క సుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే బాల్క సుమ న్ అడ్వకేట్ల బృందం కౌంటర్ పిటిషన్ వేసిం ది.
Balka Suman | మంచిర్యాల, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కోర్టులో బాల్క సుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే బాల్క సుమ న్ అడ్వకేట్ల బృందం కౌంటర్ పిటిషన్ వేసిం ది. కేసు నమోదు చేసిన పో లీసు అధికారే ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నారని, విచారణ పూర్తయ్యాకే కోర్టు రిమాండ్ విధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని కౌంటర్ దాఖలు చేశారు.
అరెస్టు చేసే సమయంలో రెండు గంటల ముందు సమాచారం ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా హడావుడిగా అరెస్టు చేశారని.. ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న నేపథ్యం లో కస్టడీకి ఇవ్వకుండా, బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరినట్టు న్యాయవాదులు తెలిపారు. సుమన్‌ను రిమాండ్‌కు తరలించే ముందు రాళ్ల దాడి చేసినట్టు పో లీసులు సమర్పించిన పెన్‌డ్రైవ్‌లో తగిన ఆధారాలు లేనట్టు ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై సోమవారం బలమైన వాదనలు వినిపించేందుకు సుమన్ న్యాయవాదులు సిద్ధమవుతున్నారు.
పోలీస్ కస్టడీకి ఇస్తే సన్‌రైజ్ టు సన్‌సెట్, అదీ కూడా బాల్క సుమన్ లాయర్ల ఆధ్వర్యంలో చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నామని న్యాయవాదులు రవీందర్రావు, మల్లేశ్ గౌడ్ తెలిపారు. పోలీసులు వేసిన పిటిషన్లో మెరిట్స్ లేవని, అది డిస్మిస్ అయ్యే అవకాశాలే ఎక్కువ అని చెప్తున్నారు. పిటిషన్ డిస్మిస్ అయితే వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు బాల్క సుమన్ బెయిల్ కోసం వేసిన పిటిషన్ మీద సోమవారం పోలీసులు కౌంటర్ వేయాల్సి ఉండగా, వారు కోర్టును సమయం కోరే అవకాశాలున్నట్టు సమాచారం.
విచారణకు సిద్ధమవుతున్న పోలీసులు
బాల్క సుమన్ కస్టడీ పిటిషన్‌పై సోమవా రం కోర్టు ప్రత్యేక పీపీ వాదనలు వినిపిస్తారని తెలిసింది. సుమన్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, మంచిర్యాల జిల్లాలో కాకుండా ఆదిలాబాద్ లేదా రామగుండం పోలీస్ స్టేషన్లలో విచారించాలని.. అదీ కుదరకపోతే రహస్య ప్రదేశంలో విచారించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

