శ్రీవిష్ణు తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ ఇటీవలే విడుదలైంది. వారం వ్యవధిలోనే ఆయన ‘మృత్యుంజయ్’ సినిమాతో మరోమారు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ నెల 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. రెబా మోనికా జాన్ కథానాయిక.
శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఓ హంతకుడి కోసం చేసే అన్వేషణ నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్ అంశాలతో ట్రైలర్ ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగింది.
హీరోకి మాత్రమే కనిపిస్తున్న ఆ హంతకుడు, పోలీసులకు మాత్రం ఎందుకు కనిపించడం లేదు? అసలు నేరం ఏమిటి? హీరో దానిని ఎలా పరిష్కరించాడు? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తించాయి. కాల భైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. శ్రీవిష్ణు సరికొత్త మేకోవర్‌లో కనిపించారు.