Friends | తొగుట, సెప్టెంబర్ 30 : ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నవారే నిజమైన స్నేహితులని వారంతా మరోసారి నిరూపించారు. 1991-92 సంవత్సరంలో తొగుట గ్రామంలో పదవ తరగతి విద్యను అభ్యసించారు. ఆపదలో ఉన్న తోటి మిత్రులకు ఆపన్నహస్తం అందించేందుకు అందరూ చేయిచేయి కలిపారు.
సెప్టెంబర్ నెలలో ఆకస్మిక మరణానికి గురైన వెంకట్ రావు పేట గ్రామస్తుడు సిరిసిల్ల రాజేశం కుటుంబానికి,గతంలో భర్తను కోల్పోయిన మిత్రురాలు తొగుట గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబాలకు ఎంతో కొంత మొత్తాన్ని ఆర్ధిక సహాయాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. 19 మంది స్నేహితులంతా కలిసి ఒక్కొక్కరు కొంత కొంత మొత్తాన్ని జమచేశారు. రెండు కుటుంబాలకు కొంత మొత్తాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.
రాజేశం కుటుంబానికి భరోసా నిస్తూ పిల్లల చదువులు పూర్తి అయ్యాక ఉద్యోగాల విషయంలో తమకున్న పరిధిలో సహాయపడుతామని భరోసానిచ్చారు. ఈ సహాయ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన మిత్రులకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో శ్రీరామ శర్మ, నాగరాజు, అతహర్ (అత్తర్), రాంరెడ్డి, రాం చంద్రారెడ్డి,రఘువర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, విశ్వనాథ్, యెల్లాగౌడ్, ( రాము), యెర్రం పెంటయ్య, నందనం శ్రీశైలం, గోపాల్ రెడ్డి, జిల్లా రమేష్, గంగా ప్రసాద్, నర్సింహా రెడ్డి, నజీరోద్దీన్, ఇస్మాయిల్, జే నర్సింలు, సుతారి రమేష్ పాల్గొన్నారు.
Kuberaa | కుబేర మీ ముందుకు వచ్చేస్తున్నాడు.. ధనుష్ ఫ్యాన్స్ రెడీనా..?
Junior | మూడు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కిరీటి జూనియర్.. మూవీ లవర్స్ రియాక్షన్ ఏంటో మరి..?
Rukmini Vasanth | కాంతార హీరోయిన్ రుక్మిణి వసంత్ అడ్వెంచరస్ సర్ఫింగ్.. ఎక్కడికెళ్లిందో మరి..!