Rukmini Vasanth | కొన్ని రోజులుగా కన్నడ, తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతున్న పేరు రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). దీనిక్కారణం ఈ బెంగళూరు భామ నటిస్తోన్న కాంతార చాప్టర్ 1. అక్టోబర్ 2న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా కన్నడ, తెలుగుతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవలే విడుదల చేసిన కాంతార ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండగా.. ఇందులో రుక్మిణి వసంత్ కనకవతి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్.
కాగా ఇన్ని రోజులుగా షూటింగ్ కమిట్మెంట్స్, ప్రమోషన్స్‌తో బిజీబిజీగా గడిపిన రుక్మిణి వసంత్ కాంతార చాప్టర్ 1 విడుదలకు ముందు కాస్త రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. బ్లాక్ సూట్ స్పోర్ట్స్ వేర్లో సముద్రతీరనా సర్ఫింగ్ చేసింది. సముద్ర అలలు సాగర తీరానికి ఉధృతంగా కొట్టుకువస్తున్నా ఏ మాత్రం భయపడకుండా స్నగ్ డైవింగ్ సూట్లో అడ్వెంచరస్ రైడ్ చేసి ఔరా అనిపిస్తోంది. సర్ఫ్బోర్డుపై ప్రొఫెషనల్ అథ్లెట్‌లా చాలా కాన్ఫిడెంట్‌గా రైడ్ చేసింది. ఫ్యామిలీతో కలిసి బీచ్ తీరాన సరదాగా షికారు చేసింది.
రుక్మిణి వసంత్ నటించిన కన్నడ చిత్రం Baanadariyalli సెప్టెంబర్ 28తో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని క్యాప్షన్‌గా పెట్టింది రుక్మిణి వసంత్. ఇంతకీ ఈ భామ ఎక్కడికెళ్లిందనేది తెలియాల్సి ఉండగా.. ఈ వెకేషన్ స్టిల్స్ మాత్రం నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
రుక్మిణి వసంత్ వెకేషన్ సాగిందిలా..
Baahubali | బాహుబలి రీ రిలీజ్.. ప్రభాస్, రాజమౌళి మ్యాజిక్ వంద కోట్లు వసూలు చేస్తుందా ?