Kuberaa | యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, సింగర్‌గా ఇండియావైడ్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కోలీవుడ్ సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటాడు ధనుష్ (Dhanush). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ ఈ ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర (Kubera) సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడని తెలిసిందే. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.
తెలుగులో మంచి టాక్‌తో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన కుబేర.. తమిళంలో మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. కాగా థియేటర్లు, ఓటీటీలో ఈ సినిమాను మిస్సయిన వారి కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. కుబేర ఇక టీవీల్లో సందడి చేయనుంది. కుబేర అక్టోబర్ 5 (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు స్టార్ మాలో ప్రీమియర్ కానుంది. మరి ఈ చిత్రానికి టెలివిజన్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.
కుబేర చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషించగా.. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటించాడు. పాపులర్ బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కించారు.
సరస్వతీ దేవి తలెత్తుకునే సినిమా ….❤️
Watch #KuberaaWorldTelevisionPremiere, This Sunday @ 5:30 PM on #StarMaa#Kuberaa #KuberaaOnStarMaa#Dhanusha KING #Nagarjuna #RashmikaMandanna #JimSarbh #SekharKammula #DeviSriPrasad #SreeVenkateswaraCinemasLLP #AmigosCreations pic.twitter.com/65tfqwqwPz
— Starmaa (@StarMaa) September 30, 2025
Baahubali | బాహుబలి రీ రిలీజ్.. ప్రభాస్, రాజమౌళి మ్యాజిక్ వంద కోట్లు వసూలు చేస్తుందా ?