Junior | గాలి కిరీటి రెడ్డి హీరోగా డెబ్యూ ఇచ్చిన చిత్రం జూనియర్ (Junior). పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. శ్రీలీల హీరోయిన్గా నటించిన జూనియర్ జులై 18న తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన జూనియర్ ఇక ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
సుమారు 10 వారాల థ్రియాట్రికల్ రన్ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని కన్నడలో చూడాలనుకునే ప్రేక్షకులకు Nammaflix కూడా అందుబాటులో ఉంది. మరి థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయిన ఈ చిత్రం ఏకంగా మూడు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ప్రీమియర్ అయిన నేపథ్యంలో.. ఓటీటీ మూవీ లవర్స్ నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
జూనియర్లో బాలీవుడ్ బ్యూటీ జెనీలియా కీలక పాత్రలో నటించగా.. రావు రమేశ్ , రవిచంద్ర్, సుధారాణి, సత్య, హర్ష చెముడు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ మూవీని నిర్మించారు.
#junior (Telugu) streaming now on Both #ahatamil & prime video 👍
Kannada version of #junior streaming on #Nammaflix pic.twitter.com/XO8fkkK3JD
— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) September 30, 2025
Baahubali | బాహుబలి రీ రిలీజ్.. ప్రభాస్, రాజమౌళి మ్యాజిక్ వంద కోట్లు వసూలు చేస్తుందా ?