హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తె లంగాణ): అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తనను రాజ్యాసభకు పంపాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు. చిన్నారెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరాభవన్లో ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు.
రెండేండ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంను తాను వెనకి ఇచ్చే సమయంలో.. తనను రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం ఇచ్చిన హామీని ఖర్గే దృష్టికి తెచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.