Komuravelli Mallanna Temple | చేర్యాల, మార్చి 23 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు బస చేసిన మల్లన్న కాటేజీలో ఇవాళ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన మల్లెల సుదర్శనం అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న దర్శనానికి కొమురవెల్లికి శనివారం ఆలయ కాటేజీని అద్దెకు తీసుకుని అందులో బస చేశాడు.
ఉదయానే స్వామి వారి దర్శనం, బోనం, పట్నం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు 9:30 గంటలకు గది నుంచి ఆలయానికి వెళ్లి మొక్కులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం 23:15గంటల సమయానికి తిరిగివచ్చారు. అప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు కాటేజీ వెనుకభాగం నుంచి గదిలోకి ప్రవేశించి భక్తునికి చెందిన 15 గ్రాముల బంగారు నెక్లెస్‌తోపాటు రూ.4500 నగదు ఉన్న బ్యాగును ఎత్తుకుపోయారు.
చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న బాధితులు కొమురవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
Current Wires | ఇంటిపై విద్యుత్ తీగలు.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?