Minister Konda Surekha | నల్గొండ (రామగిరి), మార్చి 23 : హిందూ ధర్మ సాంప్రదాయాల్లో పంచాంగానికి ఎంతో విశిష్టత ఉంది. ఏ శుభకార్యాన్ని చేయాలన్నా పంచాంగం లోని శుభ తిథులు ఆధారంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఇది దిక్సూచి లాంటిదని తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన ప్రముఖ పురోహితుడు, అర్చకుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ విశ్వవసునామ సంవత్సర పంచాంగాన్ని ఇవాళ హైదరాబాద్లోని మంత్రి నివాసంలో దేవాదాయ శాఖ కమిషనర్ సునీల్ కుమార్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్తో కలిసి ఆమె ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పంచాంగాలను తయారుచేసి బ్రాహ్మణులు, అర్చకులు పురోహితులకు అందజేయడం అభినందనీయమన్నారు. బ్రాహ్మణ అర్చకుల అందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి పంచాంగంతోపాటు జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ధూప దీప నైవేద్య అర్చక సంఘం నల్గొండ జిల్లా బాధ్యులు పగిడిమర్రి ప్రసాద్ శర్మ, మిర్యాలగూడ ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్ శర్మ, కోశాధికారి గొట్టేటి గాయత్రి శర్మ, సాంబయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆవిష్కరణకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు – దౌలతాబాద్ వాసుదేవ శర్మ
తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వవసు సంవత్సర 2025-26 పంచాంగ ఆవిష్కరణకు హైదరాబాదు వచ్చిన ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ధూప దీప నైవేద్య అర్చక సంఘం బాధ్యులు అర్చకులు పురోహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎన్నో వ్యయప్రాయాలను ఎదుర్కొని సకాలంలో హాజరై విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. త్వరలో పంచాంగ వితరణ సైతం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు