Munipally | మునిపల్లి, మార్చి 21 : మండల కేంద్రమైన మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్టేషన్లు చేసే కంప్యూటర్ ఆపరేటర్ స్టైలే వేరు అబ్బా.. భూముల అమ్మకాలు.. కొనుగోలు జరిగే సమయంలో ఏమైనా పోరపాట్లు ఉన్నాయా అని వెతకడం ఓ ఆపరేటర్ పద్ధతి.. భూములల్లో ఏమైనా పోరపాట్లు ఉంటే ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లడం ఆపరేటర్ లక్షణం.. కానీ మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ రజినికాంత్ మాత్రం అదే ఆసరాగా తీసుకోని భూముల రిజిస్ట్రేషన్లు జరిగే సమయంలో ఆ డాక్యుమెంట్లల్లో తప్పులు ఉంటే అప్పటిమటుకు రిజిస్ట్రేషన్ నిలిపివేసి నీతులు చెప్పి పక్కకెళ్లండంటూ చెప్పడంతోనే అసలు కథ మొదలవుతుంది.
వారి అవసరాల కోసం భూములు అమ్మకాల.. కొనుగోలుదారులు సార్ ప్లీజ్ రిజిస్ట్రేషన్ చేయ్యండి సార్ ప్లీజ్ అంటు బతిమిలాడుతూ ఓ సారి పక్కకు రండి సార్ అని బతిమలాడుతుంటే ఆపరేటర్ మునిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న చాయ్ దుకాణాల్లోకి వెళ్లి బేరం కుదుర్చుకోవడం.. ఇట్ల బేరం కూదిరిన మరో క్షణమే నిలిపివేసిన భూమి రిజిస్టేషన్ పనులు చకచక చేసేస్తాడు. మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్‌లో అధికంగా డబ్బులు వస్తున్నట్లు సంబంధిత అధికారులకు తెలిసినప్పటికి మునిపల్లి తహసీల్దార్ కార్యాలయం అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.
నాలుగు రోజుల క్రితం మునిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ రైతు తన అవసరాల నిమిత్తం భూమి అమ్మకానికి పోతే బ్యాంకులో లోన్ ఉంది లోన్ క్లియర్ చేసుకొని రాపో అని చెప్పడంతో ఆ రైతు ధరణి ఆపరేటర్‌కు ఫోన్‌పే ద్వారా రెండు వేల రూపాయలు పంపిస్తే లోన్ ఉన్నప్పటికి రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం.
మునిపల్లి సబ్‌రిజిష్టర్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్ భూముల అమ్మకాలు.. కొనుగోలు చేసే క్రమంలో అధికంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు మండల అధికారులకు సమాచారం ఉన్నప్పటికి ధరణి ఆపరేటర్‌పై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా అధికారులు స్పందించి భూముల రిజిస్ట్రేషన్లు చేసే క్రమంలో భూముల అమ్మకం.. కొనుగొలుదారుల నుంచి అధికంగా డబ్బులు వసూళ్లు చేస్తున్న ధరణి ఆపరేటర్‌పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల వాసులు జిల్లా అధికారులను కోరుతున్నారు.