హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల్లో బుధవారం ఒక్కరోజే 13 మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో 10, వరంగల్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా అధికారులు పట్టుకొని డిబార్ చేశారు. ఈ ఏడాది పరీక్షలు ప్రారంభమైన తర్వాత ఇంత మంది పట్టుబడటం ఇదే తొలిసారి. బుధవారం నిర్వహించిన పరీక్షకు 97.24% విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.