Current Wires | చిలిపిచెడ్, మార్చి 23 : గ్రామాల్లో విద్యుత్ తీగలు చేతికి అందే స్థితిలో ఉండడంతో ప్రజలు, రైతులు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఈదురు గాలులు వస్తే స్థానికులు, రైతులు జంకుతున్నారు. వ్యవసాయ పనులు చేస్తుండగా ఎప్పుడు కరెంట్ తీగలు తెగి మీద పడుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరెంట్ సమస్యలను పరిష్కరించాలని ఎన్ని సార్లు అడిగిన విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల పరిధిలోని చిట్కుల్ గ్రామంలో బోయిని ఆంజనేయులు, గౌండ్ల విఠల్ గౌడ్ ఇంటిపై నుంచి 11కేవీ విద్యుత్ తీగలు, కొంత మంది పొలలో భూమి తాకేలా ప్రమాదకరంగా విద్యుతు తీగలు ఉన్నాయి. అలాగే మండలంలోని రైతులు పొలంలో విద్యుత్ తీగలను సరి చేయాలని ఎన్ని సార్లు మండల విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకపోయినా ఫలితం లేకపోవడం ఏంటని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇప్పుటికైనా విద్యుత్ అధికారులు స్పందించి పొలాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా విద్యుత్ అధికారులు వ్యవహిస్తున్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు