అచ్చంపేట, మార్చి 1 : సినీ హీరో విజయ్‌దేవరకొండ తన వి వాహ రిసెప్షన్‌ను సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మెన్‌పేట గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నారు. నూతన దంపతులు తమ గ్రామ ప్రజల ఆశీర్వాదాలు పొందేందు కు ప్రత్యేకంగా ఈ వేడుకను ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది.
గ్రామంలో పండుగ వాతావరణం
దేవరకొండ గోవర్ధన్‌రావు-మాధవి దంపతులకు విజయ్‌దేవరకొండ, ఆనంద్దేవరకొండ ఇద్దరు కుమారులు. విజయ్‌దేవరకొం డ తుమ్మెన్‌పేట గ్రామంలోనే జన్మించారు. విజయ్ దేవరకొండకు నాలుగేళ్లు ఉన్నప్పుడు గ్రామంనుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రా మంలో 8 ఎకరాల వ్యవసాయభూమి, పండ్లు, పూల తోట, అందమైన ఇల్లు ఉన్నది. విజయ్‌దేవరకొండ సాధారణ కుటుంబం నుం చి ఎదిగి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్‌గా నిలిచారు. అలాం టి హీరో తన జీవితంలోని ముఖ్యఘట్టమైన వివాహ రిసెప్షన్‌ను స్వగ్రామంలో నిర్వహించుకోవడం గ్రామస్తులకు గర్వకారణంగా మారింది. మా ఊరిబిడ్డ దేశం గర్వించే స్థాయికి చేరుకొని మళ్లీ మా మధ్యకే వచ్చి వేడుక జరుపుకోవడం మా అదృష్టం అంటూ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అంగరంగవైభవంగా ఏర్పాట్లు
గ్రామస్తులు వేడుకవద్ద స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. సంప్రదాయ బద్ధంగా కోలాటాలు, జానపద నృత్యాలు, డప్పుల వాయిద్యాలతో నూతన దంపతులకు ఘనస్వాగతం పలుకనున్నా రు. మహిళలు మంగళహరతులతో ఆహ్వానం పలకడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా వీఐపీలు 800 మందికి ప్రత్యేక వంటకాలు ఏర్పాట్లు చేశారు. అభిమానులు, ప్రజల కోసం పక్కన్నే టెంట్లు వే సి దాదాపు 5వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. రథంలో జరిగే కార్యక్రమాలను వీక్షించడానికి రెండు పెద్ద స్క్రీన్లను ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, స్థానిక ప్రముఖులు, రాజకీయ నేతలను, గ్రామస్థులను ఆహ్వానించారు. వీఐపీ కేటగిరీలో ముఖ్యులను, మీడియా వారికి ప్రత్యేక పాసులు జారీ ఈ వేడుకలకు ప్రత్యేకంగా తెలంగాణ రుచులతో 42 రకాల వంటకాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా విజయ్‌దేవరకొండ-రష్మిక మందన్నను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా సమీప జిల్లాల నుంచి కూడా అభిమానులు రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు నిర్వహకులు తెలిపారు.