సిద్దిపేట, మార్చి 1: ఉజ్వల కెరీర్‌కు పదో తరగతి ఎంతో కీలకమని, ఆత్మవిశ్వాసంతో చదివితే లక్ష్యం చేరుకోవచ్చని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ‘విజయీభవ’ ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడు తూ.. పదో తరగతి మంచి మారులతో పాసైతేనే మీ కెరీర్ బాగుంటుందన్నారు. మంచి మారులు సాధిస్తే ఐ ప్యాడ్ గిఫ్ట్‌గా తాను ఇస్తానన్నారు. మీ మైండ్‌లో మ్యాటర్‌తో పాటు మైండ్‌లో పవర్ ఉండాలన్నారు. చేతిరాత బాగుంటేనే తలరాత బాగుంటుందనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలన్నారు.
సబ్జెక్టులపై పట్టు ఉంటేనే సరిపోదని, దానిని పేపర్ మీద బాగా రాస్తేనే మంచి మారులు వస్తాయని హరీశ్‌రావు సూచించారు. మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉంటుందన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో అత్యధిక సీట్లు సిద్దిపేట జిల్లా విద్యార్థులు సాధిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. గతేడాది సిద్దిపేట నియోజకవర్గం నుంచి బాసర ట్రిఫుల్ ఐటీలో 167 సీట్లు సాధించడం తనకు గర్వంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట అన్నింట్లో ఆదర్శంగా ఉందని, పదో తరగతి ఫలితాల్లో ఫస్ట్ రావాలన్నదే తన తపన అన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపి, పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు పేరు తేవాలన్నారు.
సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఈసారి 2875 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారని, వారికి తాను సొంత ఖర్చులతో ప్రత్యేక తరగతులకు స్నాక్స్ ఏర్పాటు చేయించినట్లు హరీశ్‌రావు తెలిపారు. ఇంట్లో టీవీలు బంద్ చేయించాలని, మంచిగా చదివించాలని తాను మీ తల్లిదండ్రులకు ఫోన్ చేశానని గుర్తుచేశారు. ఇంట్లో ఉండి చదువుకోవడానికి డిజిటల్ కంటెంట్ బుక్స్ అందించినట్లు తెలిపారు. పేద పిల్లలు మాత్ర మే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారని, కానీ, వారే మెరికలాంటి విద్యార్థులు అన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు దేశిరెడ్డి, రాజిరెడ్డి, పాఠశాల హెచ్ఎం రాజా ప్రభాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్ రామస్వామి, నాయకులు రాజనర్సు, రాధాకృష్ణ శర్మ, పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, రెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.