Rayapole Mandal | రాయపోల్, ఫిబ్రవరి 14 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం, మంతూరు తదితర గ్రామాల్లో శివాలయాలు ఉత్సవ శోభతో ముస్తాబయ్యాయి. రామారం మహాదేవుని ఆలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా పంచామృత రుద్రాభిషేకం, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం రుద్రహోమం అనంతరం పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని ఘనంగా జరపనున్నారు.
మంగళవారం ఉదయం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్, సర్పంచ్, పాలకవర్గ సభ్యులు తెలిపారు. మంతూరులో మల్లన్న కళ్యాణం.. మహాశివరాత్రి సందర్భంగా మంతూరు గ్రామంలోని మల్లన్న గుట్ట ఆలయంలో శనివారం హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం అభిషేకం నిర్వహించి, సాయంత్రం మల్లన్న కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.
పార్థేశ్వరాలయంలో కళ్యాణ మహోత్సవం..
రాయపోల్ మండల కేంద్రంలోని శ్రీ ఉమా పార్టీవేశ్వర ఆలయంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం. పుష్పాలంకరణ. బిల్వార్చన. మంగళ హారతి. మంత్రపుష్పం. తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 5 గంటల వరకు లింగోద్భవ కాలానికి పంచామృత అభిషేకం స్వామివారి అలంకరణ మంగళహారతులు తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.


Mallela Rajasri | బీఆర్ఎస్లో ఛైర్మన్ పదవి అనుభవించి కాంగ్రెస్లోకి జంప్.. బుద్ధిచెప్పిన ఓటర్లు
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి మిస్సింగ్