Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి మిస్సింగ్
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (22) ఫిబ్రవరి 9వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతని కోసం ఐదు రోజులుగా అమెరికా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆచూకీ లభించలేదు.
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (22) ఫిబ్రవరి 9వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతని కోసం ఐదు రోజులుగా అమెరికా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆచూకీ లభించలేదు. ఈ మిస్సింగ్‌పై శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.
ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాకేత్.. అమెరికా కాలిఫోర్నియాలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. సాకేత్ చివరిసారిగా క్యాంపస్‌కు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బర్క్లీ హిల్స్‌లోని లేక్ అంజా సమీపంలో కనిపించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ పరిసర ప్రాంతాలు సహా నగరవ్యాప్తంగా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభించకలేదు. ఈ ఘటనపై శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. సాకేత్ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని, వారి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చింది. అమెరికా అధికారులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

