మిరుదొడ్డి, మే 09 : రెక్కలు ముక్కలు చేసుకొని పడించిన పంటలు అకాల వర్షాలు కురువడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పెద్దన్నగారి శంకర్ అన్నారు. శుక్రవారం లింగుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి పంటల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ శంకర్ మాట్లాడుతూ వడగండ్ల వర్షాలకు వడ్లు రాలిన రైతులకు ఎకరానికి రూ.40 వేలు వరకు నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో రైతులు మహేశ్, రమేశ్, బిక్షపతి, శ్రీమతి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Indian Railway | సరిహద్దుల్లో ఉద్రిక్తత.. జమ్మూ, ఉదంపూర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు..!
CA Exams | పాక్-భారత్ ఉద్రిక్తతలు.. సీఏ పరీక్షలు వాయిదా
Air Sirens: చండీఘడ్లో మళ్లీ మోగిన ఎయిర్ సైరన్