CA Exams | పాక్-భారత్ ఉద్రిక్తతలు.. సీఏ పరీక్షలు వాయిదా
దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు (CA Exams) వాయిదా పడ్డాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు (CA Exams) వాయిదా పడ్డాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం పరీక్షకు నమోదుచేసుకున్న అభ్యర్థులు ఐసీఏఐ వెబ్సైట్ icai.org. చూడవచ్చని తెలిపింది.
కాగా, షెడ్యూల్ ప్రకారం సీఏ పరీక్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రూప్ 1 ఫైనల్ ఎగ్జామ్ 2, 4, 6 తేదీల్లో నిర్వహించగా, గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 13 తేదీల్లో జరగాల్సి ఉంది. అనంతరం జరుగనున్న పరీక్షలు ప్రస్తుతం వాయిదా పడ్డాయి. ఇంటర్‌కు సంబంధించిన పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు 1 నుంచి పేపర్ 5 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం5 గంటల వరకు, పేపర్ 6 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

