Savitribai Phule | రాయపోల్ జనవరి 03 : మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షుడు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్షరజ్ఞానం లేని మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయురాలు సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు.
మనుధర్మ శాస్త్ర ప్రకారం మహిళలు చదువుకునే అవకాశం లేదు. ఎన్నో నిర్బంధాలు, అవమానాలు, దాడులు అణిచివేతను ఎదుర్కొని తన భర్త జ్యోతిరావు పూలే సహాయంతో విద్యాబుద్ధులు నేర్చుకొని దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించారు.ప్రత్యేకంగా ఆడపిల్లలను చదివించేందుకు ఎదురైన అవమానాలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విద్యాబోధన కొనసాగించిన సావిత్రిబాయి పూలే త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు.
నేటి తరాలు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు సొక్కం స్వామి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్, లింగం, బాల కృష్ణ, బొల్లం రాజేష్, సుధాకర్ ,శ్రీకాంత్,నవీన్,అక్బర్,నాగరాజు, విక్రమ్, చాణక్య, యాదగిరి,భరత్, చింటు, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు..
రాయపోల్ జనవరి 03. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి మండలంలోని ఎల్కల్ ప్రాథమిక పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలని, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. మహిళలు, శూద్రులు చదువు పొందడానికి కఠినమైన సామాజిక ఆంక్షలు ఉన్న కాలంలో వాటన్నింటిని చేధించి విద్య మాత్రమే విముక్తికి మార్గమని నిరూపించిన ధైర్యశాలి అని సావిత్రిబాయి గురించి వివరించారు. పాఠశాలలో 3వ తరగతికి నిర్వహిస్తున్న FLS మాక్ టెస్ట్, మధ్యాహ్న భోజనం పరిశీలించారు.
కాగా వడ్డేపల్లి పాఠశాలలో చదువుల తల్లి భారత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను మండలంలోని వడ్డేపల్లి ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ రాజా గారి రేణుక రాజా గౌడ్, ఉప సర్పంచ్ మర్యాల స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సీఆర్పీ యాదగిరి, ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, ఉపాధ్యాయులు నరసింహ, నరేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


Jogu Ramanna | రైతు సమస్యలపై మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆందోళన
Khammam Rural : 32 వార్డులు 45 వేల మంది ఓటర్లు.. ఈఎంసి ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల
Bonakal : అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ