ఖమ్మం రూరల్, జనవరి 03 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు లెక్క తేల్చారు. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆయా విభాగాల అధికారులతో కలిసి విడుదల చేయడం జరిగింది. మొత్తం 45,256 వేల మంది ఓటర్ల గాను 21,742 పురుష ఓటర్లు ఉండగా 23,511 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అత్యధికంగా మొదటి వార్డులో 1,710 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా 20వ వార్డులో 1,262 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుల వారిగా ఓటర్ల వివరాలు పరిశీలిస్తే 1వ వార్డులో 1,710 ఓటర్లు, రెండవ వార్డులో 1,445 మంది, మూడవ వార్డులో 1,658 మంది, నాలుగో వార్డులో 1,469, ఐదవ వార్డులో 1,691, ఆరవ వార్డులో 1,697, ఏడవ వార్డులో 1,338, 8 వ వార్డులో 1,338, 9వ వార్డులో 1,330, పదో వార్డులో 1,410, పదకొండవ వార్డులో 1,440, 12వ వార్డులో 1,263 మంది, 13వ వార్డులో 1,323 మంది, 14వ వార్డులో 1,357 మంది, 15వ వార్డులో 1,444 మంది,
16వ వార్డులో 1,280 మంది, 17వ వార్డులో 1,365 మంది, 18వ వార్డులో 1,337 మంది, 19వ వార్డులో 1,320 మంది, 20 వార్డులో 1,262 మంది, 21 వ వార్డులో 1,323 మంది, 22వ వార్డులో 1,534 మంది, 23వ వార్డులో 1,694 మంది, 24వ వార్డులో 1,437 మంది, 25వ వార్డులో 1,384 మంది, 26వ వార్డులో 1,301 మంది, 27వ వార్డులో 1,264 మంది, 28వ వార్డులో 1,381 మంది, 29వ వార్డులో 1,694 మంది, 30వ వార్డులో 1,293 మంది, 31వ వార్డులో 1,414 మంది, 32వ వార్డులో 1,271 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారుల గణాంకాలలో తేలింది. అయితే ఈ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అందులో భాంగగానే ఈ నెల 5వ తేదీన ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి 10వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్టును విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.