ఆదిలాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగు రామన్న ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన నిర్వహించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే నివాసాల ముట్టడికి ప్రయత్నించారు. దాంతో జోగు రామన్న, ఆయన వెంట ఉన్న ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
దాంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరికి పోలీసులు జోగు రామన్నను అరెస్టు చేసి స్టేషన్కు తరలించేందుకు వాహనం ఎక్కించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, నేతలు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దాంతో మరోసారి స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.