సిద్దిపేట : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కృషి ఫలించింది. యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు నీటి విడుదల చేయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్ కు హరీశ్ రావు లేఖ రాశారు. రంగనాయక సాగర్ లో టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా మరో టీఎంసీ నింపితే యాసంగి పంటకు నీళ్లు అందుతుందని లేఖ ద్వారా ప్రభుత్వం ధ్రుష్టి కి తీసుకెళ్లారు. లేఖకు స్పందించిన మంత్రి ఇటీవలే నీటి విడుదలకు అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు నేడు రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేశారు. హరీశ్ రావు చొరవతో యాసంగి పూర్తి అయ్యే వరకు పంటలకు ఇబ్బంది ఉండదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Earthquake | అల్లూరి జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం