Artificial Intelligence | బీటెక్‌లో అవే.. డిగ్రీలోనూ అవే..ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ కోర్సులకే డిమాండ్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్(ఏఐఎంఎల్), సైబర్ సెక్యూరిటీ ఇంజినీరింగ్‌లో ప్రాచుర్యం పొందిన కోర్సులు.
- ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ కోర్సులకే డిమాండ్
- కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు కాలేజీల దరఖాస్తు
- మిగతా కోర్సులపై ఆసక్తి అంతంతే
- ఈ నెల 10 వరకు గడువు పొడిగింపు
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ) : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్(ఏఐఎంఎల్), సైబర్ సెక్యూరిటీ ఇంజినీరింగ్‌లో ప్రాచుర్యం పొందిన కోర్సులు. ఇప్పుడిదే కోర్సులకు డిగ్రీలోనూ డిమాండ్ కనిపిస్తున్నది. బీఎస్సీ ఏఐఎంఎల్ కోర్సును ప్రవేశపెట్టేందుకు 62, బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టేందుకు 37 చొప్పున కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. 2026-27 విద్యాసంవత్సరంలో 20కి పైగా కొత్త కోర్సులను ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టింది. ఈ కోర్సుల నిర్వహణకు ఆసక్తి గల కాలేజీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దాదాపు 160 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. అత్యంత డిమాండ్ ఉంటుందని భావించిన కొన్ని కోర్సుల నిర్వహణపై కాలేజీలు ఆసక్తి చూపించలేదు. బీబీఏ మారిటైమ్ టెక్నాలజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్కు 1, బీబీఏ ఎయిర్పోర్ట్, ఎయిర్‌లైన్, ఎయిర్‌స్పేస్, అండ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కు 2, బీబీఏ ట్రావెల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కు 2, బీఏ ల్యాండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ మేనేజ్మెంట్ కోర్సుకు 1, బీఎస్సీ ఫార్మాస్యూటికల్ మ్యాన్ఫ్రాక్చరింగ్ అండ్ క్వాలిటీ కోర్సును ప్రవేశపెట్టేందుకు 2 చొప్పున కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేస్తున్నాయి. మిగతా కొన్ని కోర్సుల్లో 4, 3 చొప్పున కాలేజీలు మాత్రమే దరఖాస్తులు సమర్పించాయి.
గ్రామీణ కాలేజీల అనాసక్తి..
కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీలు వెనుకబడ్డాయి. అర్బన్ కాలేజీలే ఎక్కువగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఆసక్తిచూపుతున్నాయి. వర్సిటీలవారీగా తీసుకొంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలే కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఆసక్తిచూపించాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 95 కాలేజీలు దరఖాస్తు చేయగా, వీటిలో అత్యధికం గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. కాకతీయ నుంచి 26, శాతవాహన 21, తెలంగాణ 7, మహాత్మాగాంధీ 7, పాలమూరు మూడు చొప్పున కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేశాయి. డిగ్రీలో కొత్త కోర్సులకు దరఖాస్తుల గడువును ఉన్నత విద్యామండలి మరోసారి పొడిగించింది. ఈ నెల 10 వరకు కాలేజీలు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టనుండటంతో ఆయా కోర్సులను నిర్వహించేందుకు ఆసక్తి గల కాలేజీల నుంచి ఉన్నత విద్యామండలి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పటి వరకు 160 వరకు కాలేజీలు దరఖాస్తులు సమర్పించాయి. మరిన్నీ కాలేజీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అధికారులు గడువును రెండుసార్లు పొడిగించారు.
కొత్త కోర్సులకు దరఖాస్తులిలా
- బీఎస్సీ ఏఐఎంఎల్ =62
- బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ =37
- బీఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ =12
- బీకాం డిజిటల్ మార్కెటింగ్ =13
- బీబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ =09
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

