అర్వపల్లి, జూలై 27 : కుమ్మరి సంఘం తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జిగా అర్వపల్లికి చెందిన కోటమర్తి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సోమవారం సూర్యాపేటలో కుమ్మరి సంఘం భవనం యందు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం (TRKS) రాష్ట్ర నాయకుల సమక్షంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన అందరికీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.