అమరావతి : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం రాత్రి 11:30 గంటలకు అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట , ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. . దీని ప్రభావంతో విశాఖపట్నంలోని స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఎన్నడూలేని విధంగా ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యామని, భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశామనిస్థానికులు చెబుతున్నారు. కాగా, అరకు–పాడేరు ప్రాంతం సిస్మిక్ జోన్ పరిధిలో ఉండటంతో ఇలాంటి ప్రకంపనలు అప్పుడప్పుడు సహజమేనని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Heart Disease | వాటిని నమ్ముకుంటే గుండెకు రిస్కే.. భారతీయులపై పరిశోధనలో వెల్లడి
Bab el-Mandeb | తర్వాతి టార్గెట్ బాబ్ ఎల్-మండేబ్?.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సంకేతాలు