Heart Disease | వాటిని నమ్ముకుంటే గుండెకు రిస్కే.. భారతీయులపై పరిశోధనలో వెల్లడి
గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి విస్తృతంగా ఉపయోగించే రిస్క్ కాలిక్యులేటర్లు భారతీయుల అనారోగ్య వాస్తవ ప్రమాద స్థాయిని గుర్తించడంతో పెద్ద సంఖ్యలో విఫలమవుతున్నాయని కొత్త పరిశోధన తెలిపింది.
- హృద్రోగ ప్రమాద అంచనాలో రిస్క్ కాలిక్యులేటర్ల విఫలం!
న్యూఢిల్లీ: గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి విస్తృతంగా ఉపయోగించే రిస్క్ కాలిక్యులేటర్లు భారతీయుల అనారోగ్య వాస్తవ ప్రమాద స్థాయిని గుర్తించడంతో పెద్ద సంఖ్యలో విఫలమవుతున్నాయని కొత్త పరిశోధన తెలిపింది. గుండెపోటు వచ్చిన రోగుల్లో సుమారు 80 శాతం మందిని ముందుగానే ‘హై రిస్క్ కేటగిరీగా గుర్తించడంలో ఇవి విఫలమైనట్టు ఈ అధ్యయం వెల్లడించింది.
గోవింద్ వల్లభ్ పంత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి, ఫరీదాబాద్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, ఎయిమ్స్‌లోని ఢిల్లీ కేన్సర్ రిజిస్ట్రీ శాస్త్రజ్ఞులు ఈ పరిశోధన నిర్వహించారు. తొలిసారిగా గుండెపోటు వచ్చిన 4,975 మంది రోగులపై పరిశోధన నిర్వహించి ఐదు హృద్రోగాల నిర్ధారణలో ప్రపంచ ప్రమాద అంచనా నమూనాల ప్రకారం వ్యక్తులను వర్గీకరించే విధానంలో గణనీయమైన తేడాలున్నట్టు గుర్తించారు.
డబ్ల్యూహెచ్ రిస్క్ చార్టుల వంటి టూల్స్ కొన్ని తొలిసారి గుండెపోటును వచ్చిన వారిలో ఇవి ప్రమాదాన్ని పూర్తిగా గుర్తించలేక పోయాయి. వీటిలో కొన్ని మోడల్స్ 20 శాతం మందిని మాత్రమై హై రిస్క్ కింద గుర్తించగా, మిగిలినవి దారిదాపుల్లో కూడా ఆ విషయాన్ని నిర్ధారించలేక పోయాయి. ఏఎస్సీవీడీ 2013 మోడల్ అయితే 12.3 శాతం మాత్రమే రిస్క్ ఉన్నట్టు తెలిపింది.
మొత్తం మీద మెజారిటీ మోడల్స్ ఒక మాదిరి రిస్క్ కేటగిరీలోనే వారిని ఉంచినట్టు పరిశోధన గుర్తించింది. మొత్తం మీద ఈ పాశ్చాత్య మోడల్స్‌ను అనుకరించడం వల్ల భారతీయుల గుండెపోటు ప్రమాద స్థాయిని ముందుగా గుర్తించలేక పోతున్నారని ఈ నివేదిక పేర్కొంది. ఒక వ్యక్తికి భవిష్యత్తులో గుండె సమస్యలు వచ్చే అవకాశాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే గణిత మోడల్స్ లేదా టూల్స్‌నే రిస్క్ కాలిక్యులేటర్లు అంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

