గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యం
గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని మల్లారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, మహిళ సామాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం
– మల్లారంలో జీపీ భవనం ప్రారంభం, మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన
కట్టంగూర్, జూలై 27 : గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని మల్లారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, మహిళ సామాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ భవనాలు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించే కేంద్రాలుగా నిలువాలన్నారు. మహిళ సమాఖ్య భవన నిర్మాణంతో గ్రామీణ మహిళలకు ఆర్థిక, సామాజిక సాధికారత మరింత బలోపేతం అవుతుందని, మహిళా సంఘాల కార్యకలాపాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
గ్రామానికి 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 లక్షలు తన నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పుష్పలత, మండల ప్రత్యేక అధికారి సతీష్, ఎంపీడీఓ అంజన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, పీఆర్ ఏఈ సందీప్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పెద్ది నాగమణి మల్లేష్, ఉప సర్పంచ్ దండెంపల్లి జగదీష్, మండల సమాఖ్య అధ్యక్షురాలు అయితగోని ఝాన్సీ, ఏపీఓ కడెం రాంమోహన్, నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న, మాజీ అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, నాయకులు పెద్ది యాదగిరి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

