Rohit Sharma : భారత వన్డే ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టాడు. మైదానంలో దిగాడంటే కళ్లుచెదిరే ఫుల్‌షాట్లు, ఖతర్నాక్ సిక్సర్లతో అలరించే హిట్‌మ్యాన్ తాజాగా ఓ గేమ్ షో కోసం హోస్ట్ అవతారమెత్తాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడడంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. సోనీ టీవీలో ‘Family Full House with Rohit Sharma’ అనే షోలో భారత క్రికెటర్లతో కలిసి రోహిత్ అందర్నీ కడుపుబ్బా నవ్వించనున్నాడు. ఈ గేమ్ షో శనివారం టెలీకాస్ట్ అవుతున్నందున నెట్టింట టీమిండియా మాజీ కెప్టెన్ ట్రెండింగ్‌లో ఉన్నాడు.
విధ్వంసక ఓపెనర్‌గానే మనందరికీ తెలిసిన రోహిత్ శర్మ తనలోని మరో కోణాన్ని చూపిస్తున్నాడు. మైదానంలో సరదాగా, అప్పుడప్పుడు చిరాకుగా కనిపించే రోహిత్.. ఓ టీవీ షో కోసం హోస్ట్‌గా మారాడు. క్రీజులో నిల్చొని అలవోకగా సిక్సర్లు బాదే హిట్‌మ్యాన్ ఇప్పుడు.. కౌంటర్లు, సెటైర్లతో ప్రేక్షకులను నవ్వించనున్నాడు. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌లో ‘Family Full House with Rohit Sharma’ షోలో రోహిత్ హోస్ట్.
Hitman ko maska??? 😜🤭
Family Full House with Rohit Sharma, starts tonight at 9:30 PM. Only on Sony LIV and Sony Entertainment Television.#RohitSharma #FamilyFullHouse #ComingSoon #SonyLIV pic.twitter.com/A5uEb2YBLi
— Sony LIV (@SonyLIV) September 19, 2026
భారత క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, మాజీ ఆటగాళ్లు శిఖర్ ధావన్, భారత జట్టు మాజీ కోచ్ అభిషేక్ నాయర్లను సరదాగాఈ ఓపెనర్ ఆటపట్టించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో శనివారం రాత్రి 9:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవనుంది. ఇదే కంపెనీకి చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీలివ్(SonyLiv) లోనూ ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఆట విషయానికొస్తే.. వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్‌కు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కీలకం. విండీస్‌తో మూడు మ్యాచుల్లో చెలరేగితే.. వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో చోటు దక్కే అవకాశముంది.
Some snaps from Family full house with Rohit Sharma! ❤ pic.twitter.com/B5Wfyhe6DO
— Rohit Sharma Fan (@hitmanfanfollow) September 19, 2026