EX MLA Rajaiah | నెక్ట్స్ అనర్హత వేటు కడియంపైనే.. ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ శ్రేణుల ఎదురుచూపు : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
EX MLA Rajaiah | కడియం శ్రీహరి బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ స్పీకర్‌కు స్వయంగా ఆఫిడవిట్ అందించిన నియోజకవర్గ కార్యక్రమాలలో బీఆర్ఎస్ శ్రేణులతో తాను మాట్లాడానని, వారికి ఎలాంటి పనులు చేసి పెట్టనని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నట్లు రాజయ్య అన్నారు.
EX MLA Rajaiah | స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 19 : దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. దానం నాగేందర్ మొదటి వికెట్ అయితే.. తదుపరి వికెట్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిదేనని వ్యాఖ్యానించారు.
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, దానికి దానం నాగేందర్‌పై హైకోర్టు తీర్పే నిదర్శనమని రాజయ్య పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం పార్టీ మార్పుపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో ఈ తీర్పు వెలువడిందని అన్నారు. హైకోర్టు తీర్పు కేవలం దానం నాగేందర్‌కే పరిమితం కాకుండా, పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ నిర్ణయాలపైనా ప్రభావం చూపుతుందని రాజయ్య వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి, తన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారని, ఆయన కుమార్తె కడియం కావ్యకు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇప్పించి, ఆమె గెలుపు కోసం ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీని విమర్శించారని రాజయ్య గుర్తు చేశారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ స్పీకర్‌కు స్వయంగా ఆఫిడవిట్ అందించిన నియోజకవర్గ కార్యక్రమాలలో బీఆర్ఎస్ శ్రేణులతో తాను మాట్లాడానని, వారికి ఎలాంటి పనులు చేసి పెట్టనని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నట్లు రాజయ్య అన్నారు.
దానం నాగేందర్‌తోపాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల పార్టీ మార్పులపై గతంలో అనర్హత పిటిషన్లు దాఖలైన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 1985లో కాంగ్రెస్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువచ్చారని, నేడు రాహుల్‌గాంధీ తన తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న సమయంలో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగ బక్షకుడిలా వ్యవహరిస్తున్నాడని రాజయ్య విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని, కానీ ఆయన కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ తీర్పు ఇచ్చారని అన్నారు. కడియం శ్రీహరి ఎప్పుడు అనర్హతకు గురవుతారా.. ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూస్తున్నాయని రాజయ్య అన్నారు.
Read Also :
Plank Exercise | రోజుకు 60 సెకన్ల పాటు ప్లాంక్ చేస్తే బీపీ తగ్గుతుంది.. నిపుణుల వెల్లడి..
RTC Elections | ఆర్టీసీలో ఎన్నికల నగారా.. 9న గుర్తింపు సంఘం ఎన్నికలు!
iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్ 18ప్రో.. భారత్‌లో మొదలైన 18 సిరీస్ అమ్మకాలు..!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

