Woman Beaten To Death | మహిళను కొట్టి చంపి.. ఏడుస్తున్న చిన్నారిని ఆమె మృతదేహంపై ఉంచిన హంతకులు
Woman Beaten To Death | కొందరు వ్యక్తులు ఒక మహిళను కొట్టి చంపారు. ఏడుస్తున్న కుమార్తె అయిన ఏడాదిన్నర వయస్సున్న చిన్నారిని ఆమె మృతదేహంపై ఉంచి పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళ భర్త, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బెంగళూరు: కొందరు వ్యక్తులు ఒక మహిళను కొట్టి చంపారు. ఏడుస్తున్న కుమార్తె అయిన ఏడాదిన్నర వయస్సున్న చిన్నారిని ఆమె మృతదేహంపై ఉంచి పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళ భర్త, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. (Woman Beaten To Death) కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సింధనూర్ సబ్ డివిజన్లోని ఆర్‌హెచ్ క్యాంప్ ప్రాంతంలో నివసించే 25 ఏళ్ల స్నేహపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. రాయితో ఆమె తలపై కొట్టి చంపారు. ఏడుస్తున్న ఏడాదిన్నర వయస్సున స్నేహ కుమార్తెను ఆమె మృతదేహంపై ఉంచి అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, గ్రామం శివార్లలోని పొలంలో స్నేహ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుమార్తె అయిన చిన్నారి చనిపోయిన తన తల్లిని గట్టిగా పట్టుకుని నిస్సహాయంగా ఏడుస్తూ కనిపించింది. ఇది చూసి పోలీసులు, స్థానికులు చలించిపోయారు. ఆ మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు నాలుగేళ్ల కిందట అమిత్‌తో స్నేహకు వివాహం జరిగినట్లు పోలీసులు తెలుసుకున్నారు. గత నాలుగు నెలలుగా శుభమ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో స్నేహ భర్త, ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను హత్య చేసిన వ్యక్తులు, అందుకు కారణాలు తెలుసుకునేందుకు వారిద్దరిని ప్రశ్నిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

