DUSU elections | ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం.. ఒక్క స్థానం కూడా దక్కించుకోని ఎన్ఎస్యూఐ
DUSU elections : ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఏబీవీపీ ఆధిపత్యం ప్రదర్శించింది. కీలకమైన ప్రెసిడెంట్ స్థానాన్ని గెలుచుకుంది.
DUSU elections : ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఏబీవీపీ ఆధిపత్యం ప్రదర్శించింది. కీలకమైన ప్రెసిడెంట్ స్థానాన్ని గెలుచుకుంది. వైస్ ప్రెసిడెంట్ పదవిని ఇండిపెండెంట్ గెలుచుకున్నాడు. డీయూఎస్‌యూ 2026 ఎన్నికలు సెప్టెంబర్ 18, శుక్రవారం జరిగాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ స్థానాల కోసం ఎన్నికలు జరిగాయి.
బీజేపీ అనుబంధ ఏబీవీపీ, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడ్డారు. శనివారం ఓట్లు లెక్కించారు. ఈ ఫలితాల్లో ఏబీవీపీనే ఆధిపత్యం కొనసాగించింది. కీలకమైన ఈ 4 స్తానాల్లో ఏబీవీపీ మూడింటిని గెలుచుకుంది. ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నారు. ఎన్ఎస్యూఐ మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ ఒక సీటు గెలుచుకోగా.. ఇప్పుడు అది కూడా కోల్పోయింది.
ఇది ఒక రకంగా ఆ సంఘానికి భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఏబీవీపీ తరఫున యష్ దబాస్ (24,576 ఓట్లు) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రత్యర్థిగా పోటీ చేసిన ఎన్ఎస్యూఐ అభ్యర్థి 22,523 ఓట్లు సాధించాడు. వైస్ ప్రెసిడెంట్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి దీపాన్షు (30,615 ఓట్లు)తో విజయం సాధించారు. తర్వాతి స్తానాల్లో ఏబీవీపీ అభ్యర్థి ఇషు మౌర్య (16,910 ఓట్లు), ఎన్ఎస్యూఐ అభ్యర్థి ఛత్రాత్ (4,313 ఓట్లు) నిలిచారు. సెక్రెటరీగా ఏబీవీపీ అభ్యర్థి రియా ఛావ్ది (21,650 ఓట్లు) విజయం సాధించగా, ఎన్ఎస్యూఐ అభ్యర్థి నమ్రతా చౌదురి (14,869 ఓట్లు) రెండో స్థానంలో నిలిచారు.
జాయింట్ సెక్రెటరీగా ఏబీబీపీ అభ్యర్థి లక్ష్య రాజ్ సింగ్ (16,615 ఓట్లు) విసయం సాధించారు. తర్వాతి స్తానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విశేష్ యాదవ్ (15,778 ఓట్లు) నిలవగా, ఎన్ఎస్యూఐ అభ్యర్థి గోపాల్ చౌదరి (15,206 ఓట్లు) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు విజయోత్సవ వేడుకలపై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ABVP
- DUSU elections
- NSUI
- president
RELATED ARTICLES
తాజా వార్తలు
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

