Anakapalli Trailer | నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫేమ్ యాక్టర్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రాజెక్టు ‘అనకాపల్లి’ (Anakapalli). ఖగేష్ తమ్మినేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పుష్ప 2 విలన్ తారక్ పొన్నప్ప వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్నాడు. విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో టాలీవుడ్ యాక్టర్లు శ్రీకాంత్, తమన్ సారథ్యంలోని టాలీవుడ్ థండర్స్ టీం కలిసి అనకాపల్లి ట్రైలర్‌ను లాంచ్ చేసింది.
హీరోహీరోయిన్ల నయా లవ్ ట్రాక్, డిపరెంట్‌గా సాగే తారక్ పొన్నప్ప విలనిజం , యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్‌గా నిలువబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది. మధ్యతరగతి తల్లిదండ్రులుగా త్రినాథరావు నక్కిన, ఇంద్రజ కనిపించబోతున్నారని క్లారిటీ ఇచ్చేస్తుంది. యూత్, మాస్ ఆడియెన్స్‌కి నచ్చే లవ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో కట్ చేసిన ట్రైలర్ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడం పక్కా అని హింట్ ఇచ్చేస్తుంది.
ఈ మూవీలో ఇంద్రజ అబ్బర్, మహబూబ్‌నగర్ భాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందినీ రాయ్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నక్కిన నరేటివ్స్, భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డావ్జాండ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో కీ రోల్లో కూడా నటిస్తుండటంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
‘అనకాపల్లి’ ట్రైలర్..
A grand celebration at the #Anakapalli Trailer Launch
The trailer was unveiled by @ActorSrikanth #TarunKumar @imashwinbabu & @isudheerbabu kickstarting an exciting journey❤️🔥#AnakapalliTrailer https://t.co/9u8zneZiG2@TrinadharaoNak1 #VikramSahidev #SandhyaVasishta #Indraja pic.twitter.com/HHVqfjZaLs
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) July 26, 2026