కట్టంగూర్, జూలై 27 : సాంప్రదాయ వరి పంటలకు బదులుగా తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు ఇచ్చే వంటలను రైతులు సాగు చేయాలని కట్టంగూర్ మండల వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ అన్నారు. సోమవారం కట్టంగూర్ రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మట్లాడారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు లబ్ధి చేకూర్చేలా కంది, పెసర, మినుము, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు తదితర పంటలను వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని రైతులకు సూచించారు. విత్తన మేళా కార్యక్రమం ఈ నెల 29 వరకు కొనసాగుతుందని, రైతులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కల్లెపల్లి పరుశరాములు, నవీన్, రైతులు పాల్గొన్నారు.